సూర్యాపేట డీఎంహెచ్‌వో డాక్టర్ నిరంజన్ ని ప్రభుత్వం బదిలీ చేసింది. నిరంజన్ స్థానంలో నూతన డీఎంహెచ్‌వోగా డాక్టర్ బి. సాంబశివరావును నియామకం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ సాంబశివరావు ఇప్పటి వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో విధులు నిర్వర్తించారు. యాదాద్రి భువనగిరి జిల్లాను కరోనా వైరస్ వ్యాధిరహిత జిల్లాగా సాంబశివరావు తీర్చిదిద్దారు.
సూర్యాపేటలో కరోనా కేసులు అధికంగా నమోదు అవుతున్న విషయం విదితమే. కరోనా కేసుల తీవ్రత అధికంగా ఉన్న జిల్లాలకు ప్రభుత్వం పలువురు ఐఏఎస్‌లకే ప్రత్యేక అధికారులుగా నియమించింది. వికారాబాద్ జిల్లాకు రజత్‌కుమార్ సైనీ, జోగుళాంబ గద్వాల జిల్లాకు రొనాల్డ్‌రాస్, సూర్యాపేట జిల్లాకు సర్ఫరాజ్ అహ్మద్‌ను నియమిస్తూ మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. ఆయా అధికారులు కరోనా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, సీఎస్‌కు నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.