ఏపీలో 24 గంటల్లో 56 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 56 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో గుంటూరు, కర్నూల్‌ జిల్లాల్లో 19 కేసుల చొప్పున, కడపలో 5, కృష్ణాలో 3, ప్రకాశం జిల్లాలో 4 కేసులు నమోదు అయ్యాయి. ఏపీలో ఇప్పటి వరకు 813 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు 24 మంది మృతి చెందగా, 669 మంది ఐసోలేషన్‌ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. 120 మంది ఈ వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 

అనంతపూర్‌లో 36, చిత్తూరులో 59, తూర్పు గోదావరిలో 26, గుంటూరులో 177, కడపలో 51, కృష్ణాలో 86, కర్నూల్‌లో 203, నెల్లూరులో 67, ప్రకాశంలో 48, విశాఖపట్టణంలో 21, పశ్చిమ గోదావరి జిల్లాలో 39 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.