టీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు నిరాడంబరంగా జరుపుకుందాం: రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్

ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ఆవిర్భావ దినోత్సవం వేడుకలకు దూరంగా ఉండాలని టీఆర్‌ఎస్ పార్టీ యోచిస్తోంది. కరోనా నేపథ్యంలో ఆవిర్భావ పండుగను నిరాడంబరంగా జరుపుకుందామని ఎంపీ సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. వీలైనన్ని మాస్క్‌లను పంపిణీ చేయడం ద్వారా సామాజిక హితానికి పాల్పడుదామని సంతోష్ సూచనలు చేశారు. మాస్క్‌లు పంపిణీ చేసేటప్పుడు సామాజిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. టిఆర్‌ఎస్ పార్టీ 20వ వార్షికోత్సవ సందర్భంగా కెసిఆర్ చిత్ర పటంతో తయారు చేసిన మాస్క్ లు ధరించిన ఫోటోలను సంతోష్ కుమార్ విడుదల చేశారు. ఇలాంటి మాస్క్‌లను తయారు చేసి పంపిణీ చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.