
తెలంగాణ రాష్ట్రంలో బుధవారం కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్-19తో ఇవాళ రాష్ట్రంలో ఒకరు మృతిచెందారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 943కు చేరుకుంది. వీటిలో 725 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కోవిడ్-19 కారణంగా ఇప్పటివరకు తెలంగాణలో 24 మంది మృతిచెందారు. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 194 మంది డిశ్చార్జ్ అయ్యారు.