
తెలంగాణ రాష్ట్రంలో 3 నెలల పాటు అద్దె వసూలు చేయరాదని పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి నుండి 3 నెలల పాటు అద్దె వసూలు చేయవద్దని స్పష్టం చేసింది. అద్దె వసూలు చేయనందుకు ఎలాంటి వడ్డీ కూడా అడగరాదని ఆ ఉత్తర్వులలో పేర్కొంది. బకాయిలను వాయిదాల్లో తీసుకోవాలని ఆదేశించింది. అద్దెలు ఇవ్వనివారిని వేధించటం, ఖాళీ చేయించవద్దని పేర్కొంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, పురపాలిక కమిషనర్లకు అధికారాలు అప్పగించింది. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించినవారిపై అంటువ్యాధుల చట్టం 1897, విపత్తు నిర్వహణ చట్టం 2005 కింద చర్యలు తీసుకుంటామని పురపాలిక శాఖ స్పష్టం చేసింది.