నాలుగు న‌గ‌రాల్లో ప‌రిస్థితి సీరియ‌స్ : కేంద్ర హోంశాఖ‌

దేశంలో నోవెల్ క‌రోనా వైర‌స్ ప‌రిస్థితిపై కేంద్ర ప్ర‌భుత్వం ఇవాళ ఓ అప్‌డేట్ ఇచ్చింది. అహ్మ‌దాబాద్‌, సూర‌త్‌, చెన్నై, హైద‌రాబాద్ న‌గ‌రాల్లో ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు కేంద్ర హోంశాఖ పేర్కొన్న‌ది.  మేజ‌ర్ హాట్‌స్పాట్ల వ‌ద్ద ప‌రిస్థితి సీరియ‌స్‌గా ఉన్న‌ట్లు చెప్పింది. కేంద్ర హోంశాఖ దీనిపై ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. లాక్‌డౌన్ నియ‌మావ‌ళిని ఉల్లంఘిస్తే.. ఆరోగ్య స‌మ‌స్య‌లు మ‌రింత ఆందోళ‌న‌కరంగా మారే ప్ర‌మాదం ఉన్న‌ట్లు హెచ్చరించింది. ఈ నాలుగు న‌గ‌రాల్లో లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని హోంశాఖ సూచించింది.