ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 61 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1016కు చేరింది. 24 గంటల వ్యవధిలో కరోనాతో ఇద్దరు మరణించారు. కరోనా బారినపడి మృతిచెందిన వారి సంఖ్య 31కి పెరిగింది. అనూహ్యంగా శ్రీకాకుళం జిల్లాలో తొలిసారిగా మూడు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం మండలంలో కొత్తగా 3 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు జిల్లా అధికారులు వెల్లడించారు.