పేకాడిన వ్య‌క్తికి క‌రోనా.. మ‌రో 17 మందికి కూడా..

ఇటీవ‌ల సూర్యాపేట‌లో ఓ మ‌హిళ అష్టాచెమ్మ ఆడి 31 మందికి క‌రోనాను అంటించింది. తాజాగా విజ‌య‌వాడ‌లో క‌రోనా బారిన ప‌డిన ఓ వ్య‌క్తి మరికొంత మందికి అంటించాడు. కృష్ణ‌లంక‌లోని గుర్రాల రాఘ‌వ‌య్య వీధిలో ఓ లారీ డ్రైవ‌ర్ అద్దెకు ఉంటున్నాడు. అత‌డు ఇటీవ‌ల ప‌శ్చిమ బెంగాల్‌కు వెళ్లొచ్చాడు. వ‌చ్చిన వెంట‌నే త‌న స్నేహితుల‌తో క‌లిసి పేకాట ఆడాడు. అనంత‌రం అత‌డు తీవ్ర జ్వ‌రంతో బాధ‌ప‌డ‌గా ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. వైద్య ప‌రీక్ష‌ల్లో క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. అత‌డితో పేకాడిన వారికీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 17 మందికి పాజిటివ్ వ‌చ్చింది.