కడపలో ఒకే కుటుంబంలోని ఏడుగురికి కరోనా పాజిటీవ్

ఏపీలో కరోనా వైరస్ విజృభిస్తుంది. ముఖ్యమంగా కర్నూల్, కడప, నెల్లూరు, గుంటూరు జిల్లాలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. తాజాగా కడప జిల్లా ఎర్రకుంట్లలో ఒకే కుటుంబంలోని రెండేళ్ల చిన్నారితో సహా ఏడుగురికి కరోనా పాజిటీవ్ వచ్చింది. బంగారం కోసం ప్రొద్దుటూరు వెళ్లి వచ్చిన వ్యక్తికి కరోనా సోకడంతో ఇంట్లోని కుటుంబ సభ్యులకు కూడా వైరస్ సోకింది. ఎర్రకుంట్లలో మొత్తం 11 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎర్రకుంట్లను రెడ్ జోన్ గా ప్రకటించారు. అలాగే నెల్లూరు జిల్లాలోనూ ఒకే కుటుంబంలోని ఆరుగురికి కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయ్యింది. ఇప్పటికే రాష్ట్రంలో వెయ్యికి పైగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.