భారత్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్ర కరోనా కేసుల్లో మొదటి స్థానంలో ఉండగా, గుజరాత్, ఢిల్లీ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో కరోనాతో 62 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొత్తగా 1543 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపింది. ఇండియాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 29,435కు చేరింది. ఇప్పటి వరకు ఈ వైరస్‌తో 934 మంది ప్రాణాలు కోల్పోయారు. 6,868 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
మహారాష్ట్రలో 369 మంది, గుజరాత్లో 162, మధ్యప్రదేశ్‌లో 110, ఢిల్లీలో 54, రాజస్థాన్‌లో 50, ఉత్తరప్రదేశ్‌లో 31, తమిళనాడులో 24, ఏపీలో 31, తెలంగాణలో 25, పశ్చిమ బెంగాల్లో 20, కర్ణాటకలో 20, పంజాబ్‌లో 19 మంది కరోనాతో చనిపోయారు.