
కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు పలువురు ప్రముఖులు, సంస్థలు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీగా విరాళాలు అందజేస్తున్నారు. ఆయా సంస్థల ప్రతినిధులు మంగళవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును కలిసి చెక్కులు ఇచ్చారు. మరికొందరు మంత్రి కేటీఆర్‌కు సీఎంఆర్‌ఎఫ్ విరాళాలు అందజేశారు.
సీఎంఆర్‌ఎఫ్‌కు మంగళవారం వచ్చిన విరాళాల వివరాలు (రూ.లో) :తెలంగాణ ఉన్నత విద్యామండలి : 10 కోట్లు , గ్రీన్‌కో గ్రూప్ : 5 కోట్లు, మైత్రా ఎనర్జీ గ్రూప్ : 2.50 కోట్లు, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజ్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ : 2 కోట్లు, శ్రీరామచంద్రమిషన్ : 1.50 కోట్లు, ఏపీ గ్యాస్ పవర్ కార్పొరేషన్ : కోటి, ఎస్ ఇంజినీరింగ్ కాలేజీ అకాడమీ : 30 లక్షలు, పీపుల్ టెక్ ఐటీ కన్సల్టెన్సీ : 25 లక్షలు, చిరిపాల్ పాలి ఫిల్మ్స్ : 25 లక్షలు