జోగుళాంబ గద్వాల జిల్లాలో కుక్కలకు ‘కరోనా’ పరీక్షలు

జోగుళాంబ గద్వాల జిల్లాలో శునకాలకు కరోనా వైరస్‌ సోకిందని గ్రామస్థుల ఫిర్యాదు మేరకు పశు సంవర్ధక శాఖ వైద్యులు మంగళవారం పరీక్షలు నిర్వహించారు. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం పెద్దపోతులపాడులో కుక్కలకు కరోనా సోకిందని సర్పంచ్‌ ఫిర్యాదు మేరకు పశువైద్య బృందం గ్రామంలోని కుక్కలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. గ్రామ సమీపంలోని కోళ్ల వ్యర్థాలను తిని కుక్కలు వింత రోగాలకు గురయ్యాయని, వాటికి రోగ నిరోధక టీకాలు వేశామని డాక్టర్‌ రాజేశ్‌ తెలిపారు. కుక్కలకు కరోనా సోకలేదని స్పష్టం చేశారు.