ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 73 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో ఎలాంటి మరణాలు సంభవించలేదు. ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1332కు చేరింది. ఈ వైరస్ నుంచి 287 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 31.
గత 24 గంటల్లో గుంటూరు జిల్లాలో అత్యధికంగా 29 కేసులు, కృష్ణాలో 13, కర్నూల్‌లో 11, అనంతపూర్, కడప, ప్రకాశం జిల్లాల్లో 4 కేసుల చొప్పున, చిత్తూరులో 3, పశ్చిమ గోదావరి జిల్లాలో 2, విశాఖపట్టణం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఒక్కొక్క కేసు చొప్పున నమోదు అయ్యాయి.
ఇప్పటి వరకు అనంతపూర్ జిల్లాలో 58, చిత్తూరులో 77, తూర్పు గోదావరిలో 40, గుంటూరులో 283, కడపలో 69, కృష్ణాలో 236, కర్నూల్‌లో 343, నెల్లూరులో 82, ప్రకాశంలో 60, శ్రీకాకుళంలో 5, విశాఖపట్టణంలో 23, పశ్చిమ గోదావరి జిల్లాలో 56 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.