ఉప్పల్ హెరిటేజ్‌లో కరోనా…. 34 మంది క్వారంటైన్

హైదరాబాద్ ఉప్పల్ హెరిటేజ్‌లో కరోనా వైరస్ కలవరపెడుతోంది. ఉప్పల్ పారిశ్రామిక వాడలోని హెరిటేజ్ కంపెనీలో పని చేసున్న 34 మంది సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. ఆ కంపెనీలో సెక్యూరిటి గార్డ్‌గా పని చేస్తున్న వ్యక్తికి తండ్రి నుంచి  కరోనా వైరస్ సోకింది. సెక్యూరిటీ గార్డ్‌కు పాజిటీవ్ వచ్చిన విషయాన్ని యాజమాన్యం దాటిపెట్టడంతో కంపెనీలో ఉద్యోగులు అడిగితే వారిని బెదిరించినట్టు సమాచారం. జిహెచ్‌ఎంసి అధికారులు 34 మందిని అదుపులోకి తీసుకొని క్వారంటైన్‌కు తరలించారు. రామంతాపూర్ వాసులు కంపెనీని మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు. భారత దేశంలో ఇప్పటి వరకు  కరోనా వైరస్ 31,481 మందికి సోకగా 1008 మంది మృతి చెందారు. తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 1009కి చేరుకోగా 25 మంది చనిపోయారు. ఎపిలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరించి ఉంది. ఎపిలో కరోనా రోగుల సంఖ్య 1332కు చేరుకోగా 31 మంది మరణించారు.