విజిలెన్స్ కమిషనర్‌గా సురేష్ పటేల్ ప్రమాణం

ప్ర‌ముఖ బ్యాంకింగ్ నిపుణుడు ఎన్‌ సురేష్ విజిలెన్స్ క‌మిష‌న‌ర్‌గా ప్ర‌మాణస్వీకారం చేశారు. సెంట్ర‌ల్ విజిలెన్స్ క‌మిష‌న‌ర్ సంజ‌య్ కొఠారీ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప్ర‌మాణం స్వీకారం చేయించారు. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ నేతృత్వంలోని హై ప‌వ‌ర్ క‌మిటీ గ‌త ఫిబ్ర‌వ‌రిలో విజిలెన్స్ క‌మిష‌న‌ర్‌గా సురేష్ ప‌టేల్‌ పేరును సిఫార‌సు చేసింది. సురేష్ ప‌టేల్ 2020, డిసెంబ‌ర్ వ‌ర‌కు ఆ ప‌ద‌విలో కొన‌సాగుతారు. 

కాగా, 62 ఏండ్ల వ‌య‌సున్న‌ సురేష్ ప‌టేల్‌కు బ్యాంకింగ్ రంగంలో మూడు ద‌శాబ్దాల సుదీర్ఘ అనుభ‌వం ఉన్న‌ది. 2015 నుంచి ఆయ‌న ఆంధ్రా బ్యాంకులో మేనేజింగ్ డైరెక్ట‌ర్‌గా, సీఈవోగా ప‌నిచేస్తున్నారు. అంత‌కుముందు ఓరియంట‌ల్ బ్యాంక్ ఆఫ్ కామ‌ర్స్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేశారు.