కర్నూల్ మున్సిపల్ కమిషనర్‌పై బదిలీ వేటు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో అధికంగా కేసులు కర్నూలు జిల్లాలోనే ఉన్నాయి. దీంతో కర్నూలులో కరోనా తీవ్రతపై ఎపి ప్రభుత్వం సీరియస్ గా ఉంది. మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబుపై బదిలీ వేటు వేసింది. కొత్త కమిషనర్ గా ఐఏఎస్ అధికారి బాలాజీని ప్రభుత్వం నియమించింది. ఎపిలోని అన్ని జిల్లాతో పోలిస్తే కర్నూలుపై కరోనా తీవ్ర ప్రభావం ఉంది. జిల్లాలో కేసులను గుర్తించడంలో విఫలమయినందునే మున్సిపల్ కమిషనర్ పై బదిలీ వేటు వేసినట్టు సమాచారం. ఎపి మొత్తంలో కరోనా కేసుల సంఖ్య 1,403కు చేరింది. అందులో కర్నూలు జిల్లాలోనే ఇప్పటివరకు 386 కేసులు నమోదయ్యాయి.