భారత్‌లో గురువారం అత్యధికంగా ఒక్క రోజే 1993 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో వైరస్ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 35వేలు దాటింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 73 మంది మరణించారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 35,043కు చేరుకోగా.. మొత్తం 1147 మంది చనిపోయారు. దేశంలో రికవరీ రేటు 25.36 శాతంగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 8889 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. గత రెండు వారాల నుంచి రికవరీ రేటు 13 శాతంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వైరస్ డబ్లింగ్ రేటు కూడా 3.4 రోజుల నుంచి 11 రోజులకు పెరిగిందన్నారు.