ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో కరోనా వైరస్ ఎక్కువగా ఉండడంతో తెలంగాణ ప్రజలు ఎవరు ఆ రాష్ట్రాలకు వెళ్లోద్దని తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. ఆ రెండు రాష్ట్రాల్లో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో అటు వైపు వెళ్లొద్దని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది. ఆ రెండు రాష్ట్రాలకు తెలంగాణ సరిహద్దలున్న ప్రాంతాలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎపిలోని కర్నూల్ లో కరోనా బాధితులు సంఖ్య ఎక్కువగా ఉండడంతో గద్వాల, మహబూబ్నగర్ జిల్లా వాసులు వెళ్లొద్దని అధికారులు సూచించారు. నల్లగొండ, ఖమ్మ జిల్లా వాసులు గుంటూరు, క్రిష్ణా జిల్లాలకు రాకపోకలు సాగించవద్దని పేర్కొంది. భారత్ దేశంలో ఇప్పటి వరకు కరోనా బాధితుల సంఖ్య 34,934కు చేరుకోగా 1157 మంది మృత్యువాతపడ్డారు. మహారాష్ట్రలో కరోనా వైరస్ 10,498మందికి సోకగా 459 మంది చనిపోయారు. ఎపిలో కరోనా రోగుల సంఖ్య 1403కు చేరుకుంది. ప్రపంచంలో ఇప్పటి వరకు కరోనా బాధితుల సంఖ్య 33 లక్షలకు చేరుకోగా 2.34 లక్షల మంది చనిపోయారు.