తెలంగాణ రాష్ట్రంలోని రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌జోన్లు ఇవే..

తెలంగాణ రాష్ట్రంలో వైరస్‌ ప్రభావం లేని జిల్లాల సంఖ్య పెరిగింది. కరోనా పాజిటివ్‌ కేసుల నమోదు, వైరస్‌ వ్యాప్తి ఆధారంగా రాష్ట్రంలోని జిల్లాలను రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ విభజించింది. దీనిప్రకారం రెడ్‌ జోన్‌లో ఆరు జిల్లాలు ఉండగా, ఆరెంజ్‌ జోన్‌లో 18 జిల్లాలు, గ్రీన్‌జోన్‌లో తొమ్మిది జిల్లాలు ఉన్నాయి. 

రెడ్‌ జోన్‌లోని జిల్లాలు: హైదరాబాద్‌, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్‌, వరంగల్‌ అర్బన్‌

ఆరెంజ్‌ జోన్‌ జిల్లాలు: నిజామాబాద్‌, జోగులాంబ గద్వాల, నిర్మల్‌, నల్లగొండ, నారాయణపేట, ఆదిలాబాద్‌, కామారెడ్డి, సంగారెడ్డి, కొమురంభీం ఆసిఫాబాద్‌, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, మెదక్‌, జనగాం, మంచిర్యాల, ఖమ్మం, కరీంనగర్‌, జగిత్యాల

గ్రీన్‌ జోన్‌లోని జిల్లాలు: పెద్దపెల్లి, నాగర్‌కర్నూల్‌, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్‌, సిద్దిపేట, వరంగల్‌ రూరల్‌, వనపర్తి, యాదాద్రి భువనగిరి