దేశంలో గత 24 గంటల్లో 2,553 కరోనా పాజిటివ్ కేసులు నమోవగా, 73 మంది మరణించారు. కరోనా కేసులకు సంబంధించిన హెల్త్ బులిటెన్‌ను కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసింది. దీనిప్రకారం దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 42,533కి చేరింది. ఈ వైరస్ ప్రభావంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,373 మంది మరణించారు. దేశంలో ప్రస్తుతం 29453 యాక్టివ్ కేసులు ఉండగా, 11,707 మంది బాధితులు ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం నమోదైన కేసుల్లో 27.5 శాతం మంది కోలుకోగా, మరణాల శాతం 3.25గా నమోదయ్యింది.