మేడ్చల్ పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇండస్ట్రియల్ ఏరియాలోని పవన్ కెమికల్ కంపెనీలో షార్ట్ సర్యూట్‌తో మంటలు అంటుకున్నాయి. దీంతో ఆ రసాయన గోదాం పూర్తిగా దగ్ధమైంది. పక్కనే ఉన్న విక్టరీ ఎలక్ట్రికల్స్‌కు మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు.