
ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో కరోనా మహమ్మారి దెబ్బకు కోవిడ్-19 కేసులు, మరణాలు గణనీయంగా పెరుగుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం వరకు ప్రపంచవ్యాప్తంగా వైరస్ సోకిన వారి సంఖ్య 35,84,322కు చేరగా..కరోనా మృతుల సంఖ్య 2,51,595కు పెరిగింది. అత్యధికంగా అగ్రరాజ్యం అమెరికాలో 69 వేల మంది కరోనా వల్ల చనిపోయారు.
ఇటలీలో 29 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. బ్రిటన్(28,809), స్పెయిన్(25,428), ఫ్రాన్స్(25,204) దేశాల్లో అత్యధిక మరణాలు సంభవించాయి. అమెరికాలో రికార్డు స్థాయిలో 11,80,634 మంది కరోనా బాధితులున్నారు. కరోనా తీవ్రత అధికంగా ఉన్న స్పెయిన్(218,011 కేసులు ), ఇటలీ(211,938), బ్రిటన్(191,832), ఫ్రాన్స్(169,583) దేశాల్లో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.