తెలంగాణలో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్
రాష్ట్రంలో 35 కంటైన్మెంట్ జోన్లకు 12 మాత్రమే మిగిలాయి
తెలంగాణలో రైతులదే రాజ్యం
యధాతధంగా రైతుబంధు కొనసాగింపు
మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణలో లాక్‌డౌన్ మరోసారి పొడిగింపు. ఇప్పటికే రెండు సార్లు లాక్‌డౌన్‌ను పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం తాజా ఈ నెల 29 వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణయం వెలువరించింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రగతిభవన్‌లో మంత్రివర్గ సమావేశం అనంతంరం సీఎం మీడియా సమావేశం ద్వారా మాట్లాడుతూ… ఇంకొన్నాళ్లు ఓపికపడితే కరోనాను పూర్తిగా జయించవచ్చన్నారు. 65 ఏళ్లు దాటినవారు బయటకు రాకుండా చూడాలన్నారు. రాత్రి పూట కర్ఫ్యూ యధావిధిగా కొనసాగుతుందన్నారు. రాత్రి 7 గంటల తర్వాత బయటకు వస్తే పోలీస్ చర్యలు తప్పవన్నారు.
రాష్ట్రంలో 35 కంటైన్మెంట్ జోన్లకు 12 మాత్రమే మిగిలాయి
కేంద్ర ప్రభుత్వ నియమానుసారం రాష్ట్రంలోని ఆరు జిల్లాలు రెడ్ జోన్‌లో ఉన్నవని సీఎం కేసీఆర్ తెలిపారు. రెడ్ జోన్‌లో ఉన్న జిల్లాలు.. సూర్యాపేట, వరంగల్ అర్భన్, వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్. అదేవిధంగా యాదాద్రి భువనగిరి, వరంగల్ రూరల్, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, ములుగు, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి వంటి తొమ్మిది జిల్లాలు గ్రీన్ జోన్ పరిధిలో ఉన్నయన్నారు. 18 జిల్లాలు ఆరెంజ్ జోన్‌లో ఉన్నయన్నారు. సంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, మంచిర్యాల, నారాయణపేట, రాజన్న సిరిసిల్ల, నల్లగొండ, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, జనగాం, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, జోగులాంబ గద్వాల. రానున్న 11 రోజుల్లో ఈ 18 జిల్లాలు కూడా గ్రీన్‌జోన్‌లోకి మారనున్నట్లు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 35 కంటైన్మెంట్ జోన్లు ఉంటే ఒక్క హైదరాబాద్‌లోనే 19 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయన్నారు. మిగతా 16 ఇతర రెడ్ జోన్ జిల్లాలో ఉన్నట్లు చెప్పారు. ఈ రోజుకు కంటైన్మెట్లు జోన్లు 12 మాత్రమే మిగిలాయన్నారు. 23 కంటైన్మెంట్ జోన్ల గడువు తీరిందన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో జనసాంద్రత ఎక్కువ కాబట్టి ఇక్కడ కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలోని మొత్తం కరోనా కేసుల్లో 726 కేసులు ఇక్కడనే నమోదైనట్లు తెలిపారు. ఇక్కడ కమ్యూనిటీ వ్యాప్తి ఆస్కారం ఎక్కువ కాబట్టి ముంబై దుస్థితి మనకు రావొద్దని కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నామన్నారు. గత అనుభవాల దృష్ట్యా 70 రోజుల సైకిల్ గడిచినైట్లెతే చాలా వరకు వ్యాధి కంట్రోల్ అయి మన అదుపులోకి వస్తదని వైద్యులు చెబుతున్నరు. అందుకోసం కఠిన నిర్ణయాలు తప్పవని సీఎం పేర్కొన్నారు.
తెలంగాణలో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్
తెలంగాణ రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో రేపటి నుంచి(బుధవారం) మద్యం దుకాణాలు తెరుస్తున్నట్లు చెప్పారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అమ్మకాలకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు చేపట్టవచ్చు అన్నారు. రెడ్‌జోన్ జిల్లాలో కూడా మద్యం షాపులు తెరుచుకోవచ్చన్నారు. మద్యం రేట్లను 16 శాతం పెంచుతున్నట్లు సీఎం తెలిపారు. చీప్ లిక్కర్‌పై మాత్రం 11 శాతం పెంపు ఉంటుందన్నారు. లాక్‌డౌన్ తర్వాత సైతం కూడా ఇవే రేట్లు కొనసాగుతున్నాయన్నారు. కాగా బార్‌లు, పబ్‌లు, క్లబ్‌లకు అనుమతి ఎట్టిపరిస్థితుల్లో లేదన్నారు. మద్యం దుకాణాదారులు, మద్యం కొనుగోలుదారులు కచ్చితంగా నిబంధనలు పాటించాలన్నారు. మాస్కులు లేకపోతే మద్యం ఇవ్వొద్దన్నారు. భౌతికదూరం తప్పని సరిగా పాటించాలన్నారు. నిబంధనలు పాటించని షాపులను క్షణాల్లో సీజ్ చేస్తామని హెచ్చరించారు.
కేంద్ర ప్రభుత్వ సడలింపు వల్ల మన చుట్టు ఉన్న నాలుగు రాష్ర్టాలు మద్యం దుకాణాలు తెరిచినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. మన రాష్ట్రంలో ఏపీ 890 కిలోమీటర్ల మేర, మహారాష్ట్ర 700 కిలోమీటర్ల మేర కర్ణాటక 500 కిలోమీటర్ల మేర, చత్తీస్‌గఢ్ 230 కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటున్నాయి. ఇప్పటికే గుడుంబా తయారీ మొదలైంది. ఈ నాలుగు రాష్ర్టాల్లో షాపులు తెరవడం వల్ల మనవాళ్లు కూడా అక్కడికి పోటెత్తుతున్నారు. ఈ పరిస్థితుల్లో వంద శాతం దుకాణాలు తెరవడం తప్ప గత్యంతరం లేదన్నారు. అనేక సమాలోచనల అనంతరం మంత్రి వర్గం కూడా ఇందుకు ఆమోదం తెలిపిందన్నారు.
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోందని, ఆగస్ట్ సమయానికి వ్యాక్సిన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని సీఎం కేసీఆర్ వివరించారు. సుదీర్ఘంగా సాగిన మీడియా సమావేశం ముగిసిన అనంతరం ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. భారత్ బయోటెక్, బీఈ, శాంతాబయోటెక్ సంస్థలు వ్యాక్సిన్ పరిశోధనలు సాగిస్తున్నాయని తెలిపారు. ప్రజలు స్వీయ నియంత్రణలో ఉంటేనే కరోనా కట్టడి సాధ్యమని స్పష్టం చేశారు. రాష్ట్రం మొత్తమ్మీద ఇప్పటివరకు 628 కరోనా నుంచి కోలుకున్నారని తెలిపారు.
కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా కరోనా ప్రభావిత ప్రాంతాలను రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ గా, కరోనా లేని ప్రాంతాలను గ్రీన్ జోన్ గా విభజించారని తెలిపారు. తెలంగాణలో 6 జిల్లాలు రెడ్ జోన్ లో ఉన్నాయని, సూర్యాపేట, వికారాబాద్, మేడ్చెల్, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ అర్బన్ జిల్లాలు రెడ్ జోన్ కింద ఉన్నాయని వివరించారు.
ఇక, యాదాద్రి భువనగిరి, వరంగల్ రూరల్, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, సిద్ధిపేట్, ములుగు, మహబూబాబాద్, నాగర్ కర్నూలు, పెద్దపల్లి జిల్లాలు గ్రీన్ జోన్ లో ఉన్నాయని చెప్పారు.
మరో 18 జిల్లాలు ఆరెంజ్ జోన్ లో ఉన్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. సంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల్, మంచిర్యాల్, నారాయణపేట్, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, జనగామ, కొమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, జోగులాంబ గద్వాల జిల్లాలు ఆరెంజ్ జోన్ లో ఉన్నాయని పేర్కొన్నారు. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ఆయా జోన్ల పరిధిలో నియమనిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేశారు.
*రెడ్ జోన్ జిల్లాలు:
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ అర్బన్.
*ఆరెంజ్ జోన్ జిల్లాలు:
నిజామాబాద్, గద్వాల, నిర్మల్, నల్లగొండ, ఆదిలాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, ఆసిఫాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, జగిత్యాల, సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, మెదక్, జనగామ, నారాయణపేట, మంచిర్యాల.
*గ్రీన్ జోన్ జిల్లాలు :
పెద్దపెల్లి, నాగర్ కర్నూల్, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్దిపేట, వరంగల్ రూరల్, వనపర్తి, యాదాద్రి భువనగిరి.
*ప్రైవేట్ కార్యాలయాలు 1/3 చేసుకోవచ్చు
*ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిగా నడుస్తాయి
*రిజిస్ట్రేషన్-ఇసుక మైనింగ్-రవాణా కార్యాలయాలు అన్ని రేపు తెరుస్తారు
*10వ తరగతి పరీక్షలు హైకోర్టు నిబంధనల ప్రకారం మే నెలలోనే నిర్వహిస్తాం
*ఇంటర్ స్పాట్ వ్యాలువేషన్ త్వరగానే నిర్వహిస్తారు
*వచ్చే సెలెబస్ ఇయర్ పై త్వరలో ప్రకటన చేస్తారు
*అడ్వకేట్స్ కోసం 25కోట్లు ప్రభుత్వం మంజూరు
*ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి తెలంగాణ న్యాయమూర్తి ఆధ్వర్యంలో పేద లాయర్లకు పంపిణీ చేస్తారు
*వలస కార్మికుల కోసం 7ఏడున్నర లక్షల మందికి రేషన్ పంపిణీ చేసాము
*ఇవ్వాళ మొత్తం 11 ట్రైన్స్ ఇతర రాష్ట్రాలకు పంపుతున్నాము
*12వందల మంది కార్మికులను బీహార్ నుంచి తెలంగాణకు రప్పిస్తున్నాము
*రైతుబంధు కార్యక్రమంలో ఎలాంటి అనుమానాలు వద్దు-ఒక్క రూపాయి తగించకుండా నిధులు ఇస్తాం
*ఐదున్నర లక్షల మందికి 11వందల కోట్ల రైతు రుణమాఫీ 25వేల వరకు రేపే మాఫీ చేస్తాం
*గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టత పరిపూర్ణం కావాలి
*రైతులకు నిధులు అందడం లేదు అనడంలో వాస్తవం లేదు
*ఎక్కడ రావడంతో చెప్పాలి-నేనే వస్తా ఎక్కడ రావడం లేదో చెప్పాలి