గుండెపోటుతో ఆసుప‌త్రిలో చేరిన శివాజీ రాజా

టాలీవుడ్ సీనియ‌న్ న‌టుడు,మూవీ ఆర్టిస్ట్ అసిసోయేష‌న్ మాజీ అధ్య‌క్షుడు శివాజీరాజా గుండెపోటుకి గుర‌య్యారు. వెంట‌నే కుటుంబ స‌భ్యులు ఆసుప‌త్రికి త‌రలించారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌కి చికిత్స కొన‌సాగుతుండ‌గా, ఆరోగ్యం స్థిరంగానే ఉంద‌ని వైద్యులు తెలిపారు. బీపీ ఒక్క‌సారిగా డౌన్ కావ‌డంతో ఆయ‌న‌కి హార్ట్ ఎటాక్ వ‌చ్చింద‌ని, శ‌స్త్ర చికిత్స చేసి స్టంట్ వేసే అవ‌కాశం ఉంద‌ని వెద్యులు పేర్కొన్నట్టు సురేష్ కొండేటి తెలిపారు. ఆయ‌న శివాజీ రాజాతో ఫోన్‌లో మాట్లాడిన‌ట్టు స్ప‌ష్టం చేశారు.

లాక్‌డౌన్ వ‌ల‌న కొద్ది రోజులుగా ఇంటికే ప‌రిమిత‌మైన శివాజీ రాజా..హైద‌రాబాద్ శివార్ల‌లోని త‌న ఫాం హౌజ్‌‌లో వ్య‌వ‌సాయ ప‌నుల్లో నిమ‌గ్న‌మ‌య్యారు. త‌న‌కు చిన్న‌త‌నం నుంచి వ్య‌వ‌సాయం అంటే ప్రాణ‌మ‌ని, ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో త‌న  వ్య‌వ‌సాయ క్షేత్రంలో  పండిన కూర‌గాయ‌ల్ని  పేద‌ల‌కు ఉచితంగా అంద‌జేయ‌నున్న‌ట్లు తెలిపారు. క‌ష్టాల్ని ఎదుర్కొంటున్న సినీ  క‌ళాకారుల‌కు నిత్య‌వ‌స‌ర స‌రుకుల్నిఇవ్వ‌నున్న‌ట్లు కూడా తెలిపారు. శివాజీ రాజా త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆయ‌న అభిమానులు ప్రార్దిస్తున్నారు.