దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 49,391కి చేరింది. వైరస్ ప్రభావంతో ఇప్పటివరకు 1694 మంది మరణించారు. కరోనా బారిన పడిన వారిలో 14,182 మంది బాధితులు కోలుకున్నారు. దేశవ్యాప్తంగా మరో 33,514 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 1694 కేసులు నమోదవగా, 126 మంది మరణించారు. దేశంలో కోలుకుంటున్న వారు 28.71 శాతం అని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.
దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 15,525కు చేసింది. తర్వాతి స్థానంలో ఉన్న గుజరాత్‌లో 6245 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 5104 కరోనా పాజిటివ్ కేసులతో ఢిల్లీలో మూడో స్థానంలో ఉన్నది.