తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాల ముందు బారులు….


తెలంగాణ రాష్ట్రంలో ఎట్టకేలకు మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో మందు బాబుల ఆనందానికి హద్దులు లేకుండాపోయాయి.  బుధవారం తెల్లవారుజాము నుంచే కిలోమీటర్ల పొడువునా మందబాబులు బారులు తీరారు. దాదాపు 46 రోజులపాటు ఆల్కహాల్ లేక అవస్థపడుతున్న మద్యం ప్రియుల ముఖాల్లో వెలుగులు కనిపించాయి. భౌతిక దూరం పాటించి మద్యం విక్రయించాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో ఈరోజు నుంచి వైన్ షాపులను ఉదయం 10 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు తెరవనున్నారు. మరో వైపు తెలంగాణ ప్రభుత్వం చీప్ లిక్కర్ పై 11 శాతం, అన్ని బ్రాండ్లపై 16 శాత ధరలు పెంచింది. కంటైన్మెంట్ ప్రాంతాలలో వైన్ షాపులు మూసి ఉంటాయని అధికారులు వెల్లడించారు.