లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన వాహనాల రిజిస్ట్రేషన్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. వాహనదారులు స్లాట్ బుక్ చేసుకోవడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. తాత్కాలిక రిజిస్ట్రేషన్ గడువు ముగిసినా ఎటువంటి అపరాద రుసుం లేకుండానే రిజిస్ట్రేషన్ చేస్తారు. స్లాట్ బుక్ చేసుకున్న వారు వారికి కేటాయించిన నిర్ణీత సమయంలో ఆర్టీవో ఆఫీస్‌కు రావాల్సి ఉంటుంది. కార్యాలయంలోకి వాహన యజమాని ఒక్కరినే అనుమతిస్తారు. యజమానికి ఎటువంటి అనారోగ్య లక్షణాలు ఉన్నా కార్యాలయంలోకి అనుమతించరు. స్లాట్ సంఖ్యను సగానికే పరిమితి చేశారు. వారు రోజులపాటు ఈ పద్ధతిని అనుసరించి అనంతరం సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటారు. ఆర్టీఏ ఆఫీస్‌లో ప్రతీ ఒక్కరూ బౌతిక దూరం పాటించాల్సి ఉంటుంది. నిర్ణీత సమయంలో వాహనదారుడు రాకపోతే స్లాట్ రద్దవుతుంది. కోవిడ్ నియంత్రణ నిబంధనలు తప్పని సరి పాటించాల్సి ఉంటుంది.
