విశాఖ గ్యాస్ లీక్ ప్రమాద స్థలంలో యాంటీ డోస్‌గా వాటర్ స్ప్రే చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. గ్యాస్ లీక్ ఘటనపై డీజీపీ మాAట్లాడుతూ…గ్యాస్ లీక్‌పై మొదటగా డయల్ 100కు ఫోన్ కాల్ వచ్చిందన్నారు. తర్వాత వెంటనే సహాయ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పోలీసులు సత్వరం స్పందించి స్థానికులను రక్షించారన్నారు. మైకుల ద్వారా ప్రకటన చేసి స్థానికులను అప్రమత్తం చేసినట్లుగా చెప్పారు. గాలిలో వాటర్ స్ప్రే చేయడంతో అదే యాంటీ డోస్‌గా పనిచేసిందన్నారు. ప్రమాదం సమయంలో ఫ్యాక్టరీలో 15 మంది ఉన్నారన్నారు. ఈ ప్రమాదంలో కంపెనీ ఉద్యోగులు ఎవరూ చనిపోలేదన్నారు. న్యూట్రలైజ్ ఉన్నా ఎందుకు వాడలేదు అనేది విచారిస్తున్నట్లు తెలిపారు. ఫోరెన్సిక్ టీమ్ వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. ఫ్యాక్టరీ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ సైతం సాధారణ స్థితికి వచ్చినట్లుగా డీజీపీ పేర్కొన్నారు.
