తెలంగాణలో కొత్తగా మరో 31 పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో శనివారం కొత్తగా 31 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో హైదరాబాద్‌ పరిధిలో 30 ఉండగా, రాష్ర్టానికి వలస వచ్చినవారిలో ఓ వ్యక్తికి వైరస్‌ సోకినట్టు నిర్ధారించారు. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,163కు చేరింది. శనివారం ఒకరు ప్రాణాలు కోల్పోగా, 24 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 382 మంది గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌ విడుదలచేసింది.