ప్రధాని నరేంద్రమోడీ మరోసారి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. మే 11న (సోమవారం) మధ్యాహ్నం 3.00 గంటలకు ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందని ప్రధాని కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ నెల 17న మూడో విడత లాక్‌డౌన్ గడువు కూడా ముగియనుండటంతో.. ఈ సారి లాక్‌డౌన్ నిబంధనల్లో ఎలాంటి సడలింపులు ఇవ్వాలనే అంశంపై ప్రధానంగా సీఎంలతో చర్చించనున్నట్లు సమాచారం. లాక్‌డౌన్ కారణంగా దేశ ఆర్థికపరిస్థితి దెబ్బతిన్న నేపథ్యంలో దాన్ని మెరుగుపర్చడానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా ప్రధాని ముఖ్యమంత్రులతో చర్చించనున్నట్లు తెలిసింది. ఇక దేశంలోని కంటైన్‌మెంట్ జోన్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
