తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. సోమవారం ఒకేరోజు 79 మందికి పాజిటివ్ వచ్చింది. రాష్ట్రంలో ఒక్కరోజులో ఇన్ని కేసులు రావ డం ఇదే తొలిసారి. ఈ కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదు కావడం గమనార్హం. రెడ్‌జోన్‌లో ఉన్నా ఈ స్థాయిలో కేసులు వెలుగు చూడటంతో ఆందోళన కలిగిస్తోంది.
తాజా కేసులతో రాష్ట్రంలో కరో నా పాజిటివ్‌ల సంఖ్య 1275కి చేరింది. ఇక సోమవారం 50 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 801 మంది కోలుకొని ఇంటికెళ్లారని ప్రభుత్వ బులిటెన్‌లో పేర్కొన్నారు. ఇప్పటివరకు 30మంది చనిపోగా, ఆసుపత్రుల్లో 444 మంది చికిత్స పొందుతున్నారు. నాలుగైదు రోజులుగా వెయ్యి మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, దీంతో కేసులు పెరిగి నట్లు అధికారులు చెబుతున్నారు.