ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాలలో కేంద్రబృందం పర్యటన

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా వైరస్‌ ప్రభావంపై పరిస్థితులను సమీక్షించేందుకు వచ్చిన కేంద్ర ప్రత్యేక బృందం పర్యటన కొనసాగుతోంది. కర్నూలు జిల్లాలో వారం రోజుల  పర్యటనలో భాగంగా మంగళవారం రోజున నంద్యాలలో పర్యటించి కరోనా వైరస్‌ కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పరిశీలించింది.

కేంద్ర బృందం సభ్యుల్లో డాక్టర్‌ మధుమిత దూబే, డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ ఉన్నారు. నంద్యాల పట్టణంలో బయటి పేటలోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ను పరిశీలించారు. అనంతరం చాపిరేవు గ్రామంలోని కమ్యూనిటీ క్వారంటైన్‌ సెంటర్‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. 

కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ
నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు పట్టణంలో రెడ్‌జోన్‌లను కలెక్టర్‌ వీరపాండియన్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయాన్ని తనిఖీ చేసి లాక్‌డౌన్‌పై అధికారులకు పలు సూచనలు చేశారు.