మే 16 నుంచి వందేభార‌త్ మిష‌న్ రెండో ద‌శ‌

లాక్‌డౌన్‌ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు వందేభారత్‌ మిషన్ రెండో దశ మే 16 నుంచి ప్రారంభం కానుంది. మే 16 నుంచి 22 వరకు 31 దేశాల నుంచి 149 విమానాల ద్వారా భార‌తీయుల‌ను స్వ‌దేశానికి తీసుకురానున్నారు. రెండోదశలో భాగంగా అమెరికా, కెనడా, బ్రిటన్, సౌదీ అరేబియా, యూఏఈ, ఆస్ట్రేలియా, ఖతార్, ఇండోనేసియా, ఉక్రెయిన్, కజికిస్తాన్, ఒమన్, మలేసియా, రష్యా, ఫిలిప్పీన్స్, ఫ్రాన్స్, సింగపూర్, ఐర్లాండ్, కిర్గిజిస్థాన్, కువైట్, జపాన్, జార్జియా, జర్మనీ, తజకిస్తాన్, బహ్రెయిన్, అర్మేనియా, థాయ్‌లాండ్, ఇటలీ, నేపాల్, బెలారస్, నైజీరియా, బంగ్లాదేశ్ దేశాల నుంచి భార‌తీయుల త‌ర‌లింపు ఉంటుంద‌ని అధికారులు తెలిపారు. 

రెండో ద‌శ‌లో న‌డిపే 149 విమానాల్లో కేరళకు 31, ఢిల్లీకి 22, కర్ణాటకకు 17, తెలంగాణకు 16, గుజరాత్‌కు‌ 14, రాజస్తాన్‌కు 12, ఆంధ్రప్రదేశ్‌కు‌ 9, పంజాబ్‌కు 7  చేరుకోనున్నాయి. బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల‌కు 6 చొప్పున‌, ఒడిశాకు 3, చండీగఢ్‌కు 2, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జమ్ముక‌శ్మీర్ రాష్ట్రా‌లకు ఒక్కో విమానం చొప్పున చేరుకుంటాయి.