గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన మంచిర్యాల జాయింట్ కలెక్టర్ సురేందర్ రావు దంపతులు

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ కి స్పందిస్తూ మంచిర్యాల జిల్లాలో అధికారులు ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుతూ తమ కార్యాలయాలు నివాసాలలో మొక్కలు నాటుతున్నారు. అందులో భాగంగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి జేసీ సురేందర్ రావు కు సవాల్ విసరడంతో ఆయన స్పందిస్తూ జేసీ బంగ్లాలో సతీమణి రాధికతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని భావితరాలకు నేటితరం మంచి వాతావరణాన్ని అందించాలని జేసీ సురేందర్ రావు తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీ ప్రజలు వాతావరణ కాలుష్యంతో అతలాకుతలం అవుతున్నారని అదే పరిస్థితి మన రాష్ట్ర ప్రజలకు ఎదురు కాకుండా సీఎం కేసీఆర్ రూపొందించిన హరిత తెలంగాణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జేసీ సురేందర్ రావు సూచించారు. ఆయన నివాసంలో సతీమణితో పాటు తహసిల్దార్ రాజేశ్వరరావుతో కలిసి మూడు మొక్కలను నాటారు. మొక్కలు నాటిన అనంతరం జిల్లాలోని డిఆర్ఓ, అసిస్టెంట్ సబ్ కలెక్టర్, ఆర్ డి వో లకు మూడు మొక్కలు నాటాలని జేసీ సురేందర్ రావు సవాలు విసిరారు.