రాష్ట్రంలో బుధవారం మరో 41 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనాతో ఇద్దరు చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 1,367కి చేరగా.. మృతుల సంఖ్య 34కి చేరింది. కొత్తగా 117 మందిని డిశ్చార్జి చేశారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని ఇంటికి వెళ్లినవారి సంఖ్య 939కి చేరుకుంది. ప్రస్తుతం ఆసుప త్రుల్లో 394 మంది చికిత్స పొందుతున్నారని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాస రావు తెలిపారు. ఈ మేరకు ఆయన బులెటిన్ విడుదల చేశారు. బుధవారం నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 31 ఉండగా.. వలసదారులు మిగతా 10 మంది ఉన్నారు. వలసదారుల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 35కి చేరింది.
