తెలంగాణలో గురువారం మళ్లీ 47 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో జీహెచ్ ఎంసీ పరిధిలోనే 40 నమోదు కావడం ఆందో ళన కలిగిస్తోంది. రంగారెడ్డి జిల్లాలో 5 కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలసదారుల్లో రెండు కేసులు వెలుగు చూశాయి. వారిలో ఒకరు జగిత్యాల, మరొ కరు నల్లగొండ జిల్లాకు చెందినవారని ప్రజా రోగ్య డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడిం చారు. ఈ మేరకు గురువారం ఆయన బులె టిన్ విడు దల చేశారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజి టివ్ కేసుల సంఖ్య 1,414కి చేరుకుందని తెలి పారు. ఇక గురువారం 13 మంది కోలుకోగా, వారితో కలిపి ఇప్పటివరకు 952 మంది డిశ్చార్జి అయ్యారని పేర్కొన్నారు. ఇంకా 428 మంది చికిత్స పొందుతున్నారని వివరించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 34 మంది చనిపోయా రని వెల్లడించారు.
