రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ కు స్పందిస్తూ మూడు మొక్కలను నాటిన బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ ఆర్. త్రియంబకేశ్వర్ రావు. కమిషనర్ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి మంచి కార్యక్రమాన్ని శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టడం భవిష్యత్ తరాలకు ఆదర్శం అని ఇందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు, అందుకు జోగినిపల్లి సంతోష్ కుమార్ కి ధన్యావాదలు తెలుపుతున్న అన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ సవాల్ గా విసిరారు.