తెలంగాణలో శుక్రవారం 40 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 33 మంది, ఇతర రాష్ర్టాల నుంచి వలస వచ్చినవాళ్లు ఏడుగురు ఉన్నా రు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,454కు చేరింది. 34 మంది మృతిచెందారు. 965 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మిగిలిన 461 మంది చికిత్స పొందుతున్నట్టు ప్రజారోగ్యశాఖ బులెటిన్ పేర్కొన్నది. తాజాగా 13 మంది డిశ్చార్జి అయ్యారు. ఇతరరాష్ర్టాలకు వలస వెళ్లి తిరిగొచ్చినవారిలో ఇప్పటివరకు 44 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం రాష్ట్రంలోకి వచ్చేవారికి సరిహద్దుల్లోనే పరీక్షలు చేసేందుకు 275 వైద్యశాఖ బృందాలను ఏర్పాటుచేసింది. గ్రామాల పరిధిలో ఇంటింటికి వెళ్లి జ్వర పరీక్షలుచేసే ప్రక్రియను ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎం, అంగన్వాడీలు శుక్రవారం ప్రారంభించారు.
