కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారం లాక్డౌన్ నూతన మార్గదర్శకాలను విడుదల చేయడంతో తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహంపై రాష్ట్ర మంత్రివర్గం సోమవారం భేటీ కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో సాయంత్రం 5 గంటలకు ఈ భేటీ జరగనుంది. ఈ మంత్రి వర్గ సమావేశంలో ఆర్టీసీ బస్సుల అనుమతిపై కూడా చర్చించనున్నారు. రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధివిధానాలపై చర్చించే అవకాశం ఉంది
