ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 52 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,282కి చేరింది. ఈ వైరస్ వల్ల రాష్ట్రంలో ఇప్పటివరకు 50 మంది మరణించారు. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో ప్రస్తుతం 705 యాక్టివ్ కేసులు ఉండగా, 1,527 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
కొత్తగా నమోదైన 52 కేసుల్లో 19 కోయంబేడు మార్కెట్‌తో సంబంధం కలిగినవే ఉన్నాయి. ఈ రోజు నమోదైన పాజిటివ్ కేసుల్లో చిత్తూరు జిల్లాలో 15, కృష్ణా జిల్లాలో 15, నెల్లూరులో 7, తూర్పుగోదావరిలో 5, కర్నూలులో 4, కడప, పశ్చిమగోదావరిలో రెండు చొప్పున, విజయనగరం, విశాఖపట్నంలో ఒక్కో కొత్త కేసు ఉన్నాయి.