దేశంలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లో దేశంలో 140 మంది వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఇక వైరస్ సంక్రమించిన వారి సంఖ్య 5611గా ఉన్నది. దేశవ్యాప్తంగా మొత్తం వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 106750గా నమోదు అయింది. దేశవ్యాప్తంగా 61149 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం మరణించిన వారి సంఖ్య 3303గా రికార్డు అయ్యింది. కేంద్ర ఆరోగ్య, సంక్షేమ శాఖ ఈ వివరాలను వెల్లడించింది.
తెలంగాణలో కొత్తగా 42 కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1634కు చేరుకున్నది. దీంట్లో 1011 మంది కోలుకున్నారు. 585 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 38 మంది మరణించారు. ఇక బీహార్‌లో కొత్తగా 54 కేసులు నమోదు అయ్యాయి. దీంతో పాజిటివ్ సంఖ్య 1573కు చేరుకున్నట్లు ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ తెలిపారు.