నల్లగొండ జిల్లాలోని చిట్యాల శివారులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారి ఎన్‌హెచ్-65పై ఆగివున్న లారీని ఎర్టీగా కారు అదుపుతప్పి వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కామినేని ఆస్పత్రికి తరలించారు. మృతులు ఏపీలోని రాజమండ్రి సమీపంలోని కొత్తపల్లికి చెందినవారు. వీరంతా ప్రయాణికులుగా సమాచారం. కొత్తపల్లి నుంచి హైదరాబాద్‌కు కారులో వెళ్తుండగా ప్రమాదం భారిన పడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న నల్లగొండ జిల్లా డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి పంచనామా నిర్వహించి మృతదేహాలను నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.