ఎండ తీవ్రతను తట్టుకోలేక గురువారం ఐదు నెమళ్లు మృతి చెందాయి. స్థానికుడు పన్నాల రాజు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండలం పాత సూర్యాపేట గ్రామంలోని చక్కరాయిగుట్ట సమీపంలో తనకు వ్యవసాయ భూములున్నాయి. గుట్ట చుట్టూ అనేక నెమళ్లు సంచరిస్తుంటాయి. గురువారం మధ్యాహ్నం తన వ్యవసాయక్షేత్రానికి వెళ్లగా అక్కడ ఐదు నెమళ్లు మృతి చెంది కనిపించాయని, ఎండలకు తాళలకనే నెమళ్లు మృతి చెందినట్లు ఆయన తెలిపారు.
