పార్వతీదేవి ఆలయ హుండీ ఆదాయం రూ.3.87 లక్షలు

నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు పార్వతీదేవి అమ్మవారి ఆలయ హుండీని గురువారం లెక్కించారు. లాక్‌డౌన్‌కు ముందు 40రోజులకు రూ.3,87,577 ఆదాయం వచ్చినట్లు ఈఓ అన్నెపర్తి సులోచన తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మల్గ బాలకృష్ణ, ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వరశర్మ, దేవాదాయ పరిశీలకురాలు వెంకటలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు