కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా 213 దేశాలకు వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 54,01,612కు చేరుకుంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 28 లక్షల 10 వేల 657. కోవిడ్-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 3 లక్షల 43 వేల 804 మంది మృత్యువాతపడ్డారు. వ్యాధి నుంచి కోలుకుని 22 లక్షల 47 వేల 151 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా ప్రభావం అమెరికాలో అత్యధికంగా ఉంది. కోవిడ్-19 కారణంగా యూఎస్‌ఏలో ఇప్పటి వరకు 98,683 మంది చనిపోయారు. బ్రెజిల్‌లో 22,013 మంది, రష్యా-3,388, స్పెయిన్-28,678, యూకే-36,675, ఇటలీ-32,735, ఫ్రాన్స్-28,332, జర్మనీ-8,366, టర్కీ-4,308, ఇరాన్-7,359, పెరూ-3,373, కెనడా-6,355, చైనా-4,634, మెక్సికో-7,179, బెల్జియం-9,237, పాకిస్థాన్-1,101, నెదర్లాండ్స్-5,811, ఈక్వెడార్-3,096, స్వీడన్-3,992, స్విర్జర్లాండ్-1,905, పోర్చుగల్-1,302, ఐర్లాండ్-1,604, ఇండోనేషియా-1,351, రోమేనియాలో 1,176 మంది చనిపోయారు.
