తెలంగాణలో కొత్తగా ఆదివారం 41 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరిలో 23 మంది జీహెచ్ఎంసీ పరిధిలోనివారు కాగా, రంగారెడ్డి జిల్లావారు ఒకరు, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చినవారు 11 మంది, విదేశాల నుంచి వచ్చినవారు ఆరుగురు ఉన్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,854కు చేరింది. ఆదివారం వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న నలుగురు మృత్యువాతపడగా, చికిత్స ద్వారా కోలుకొన్న 24 మంది డిశ్చార్జి అయ్యారని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది. రాష్ర్టానికి దేశ, విదేశాల నుంచి వస్తున్నవారిలో వైరస్ వెలుగుచూస్తుండటం తో వైద్యారోగ్యశాఖ అప్రమత్త చర్యలు చేపట్టింది.
