మహేశ్‌ బాబుతో ఫొటోషూట్‌ కు భారీగా వచ్చిన అభిమానులు.. తొక్కిసలాట..

హీరో మహేశ్‌ బాబుతో గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఫొటోషూట్‌కు ఏర్పాట్లు చేశారు. ఫొటోషూట్‌కు అభిమానులు భారీగా తరలిరావాలని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. ఫోటోషూట్ కోసం ఫ్యాన్స్‌ వేలాదిగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని సన్‌షైన్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై చందానగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.