సీఎం జగన్‌ అధ్యక్షతన ‘మన పాలన- మీ సూచన’

ఆంధ్రప్రదేశ్‌  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో సోమవారం నుంచి ‘మన పాలన- మీ సూచన’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మేథోమధన సదస్సు నిర్వహిస్తోంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో చేపట్టిన ఈ సదస్సులో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆయా రంగాల నిపుణులతో మాట్లాడనున్నారు. గ్రామ సచివాలయాలు, సంక్షేమం, పరిపాలన అంశాలపై లబ్ధిదారులు, నిపుణులతో చర్చించనున్నారు. ఈ సదస్సులో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు.
రాష్ట్రంలో గత ఏడాది నుంచి అమలు చేసిన కార్యక్రమాలు పథకాలు.. ఆయా రంగాల్లో తీసుకువచ్చిన మార్పులు, భవిష్యత్‌లో చేపట్టాల్సిన చర్యలపై మన పాలన–మీ సూచన ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి ఆరు రోజుల పాటు వరకు రోజూ రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో మేథోమధన సదస్సులు నిర్వహించనుంది.