భూపాలపల్లి జిల్లాలో నలుగురికి కరోనా పాజిటివ్‌

కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తున్నది. పొట్ట కూటి కోసం వలస వెళ్లి లాక్ డౌన్ నేపథ్యంలో స్వస్థలాలకు తిరిగొస్తున్న వలస కార్మికులు కరోనా బారిన పడటం కలకలం రేపుతున్నది. తాజాగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో మరో నలుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. 
మొగుళ్లపల్లి మండలం కొర్కిశాల గ్రామానికి చెందిన ముగ్గురు, చిట్యాల మండలం రామచంద్రపురానికి చెందిన ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. వీరిని చికిత్స కోసం హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానకు అధికారులు తరలించారు. వీరంతా ఢిల్లీ, ముంబై నుంచి వచ్చినవారేనని డీఎంహెచ్‌వో డాక్టర్‌ గోపాల్‌రావు తెలిపారు.