24 గంటల్లో 170 కరోనా మరణాలు, 6,387 కేసులు నమోదు

కరోనా మహమ్మారి భారత్‌ను గజగజ వణికిస్తోంది. వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కరోనా మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. పాజిటివ్‌ కేసులు కూడా వేల సంఖ్యలో నమోదు అవుతున్నాయి. భారత్‌లో గడిచిన 24 గంటల్లో 6,387 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 170 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,51,767కు చేరుకోగా, మృతుల సంఖ్య 4,337కు చేరింది. ఈ వైరస్‌ నుంచి 64,425 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 
మహారాష్ట్రలో అత్యధికంగా 54,758 కేసులు నమోదు కాగా 1,792 మంది మృతి చెందారు. తమిళనాడులో 17,728 కేసులు(మృతులు 128), గుజరాత్‌లో 14,829(మృతులు 915), ఢిల్లీలో 14,465(మృతుల 288), రాజస్థాన్‌లో 7,536(మృతులు 170), మధ్యప్రదేశ్‌లో 7,024(మృతులు 305), యూపీలో 6,724(మృతులు 177), బెంగాల్‌లో 4,009 పాజిటివ్‌ కేసులు (మృతులు 283) నమోదు అయ్యాయి.